తమిళ సినీ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు షారుక్ ఖాన్ తో పాటు నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతితో జవాన్ తీశాడు. ఈ సినిమా ఊహించని రీతిలో దూసుకు పోతోంది. ఇప్పటికే రూ. 900 కోట్ల క్లబ్ లోకి చేరుకుంది. వేయి కోట్లను దాటేందుకు పరుగులు తీస్తోంది.
ఈ జవాన్ చిత్రానికి రాక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. పెద్ద ఎత్తున ఆదరణ చూరగొంది. భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాను షారుక్ ఖాన్ భార్య రూ. 220 కోట్లు ఖర్చు చేసింది.
విచత్రం ఏమిటంటే ఈ జవాన్ చిత్రం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది ద్విభాషా నటి ప్రియమణి. నటన గురించి చెప్పాలంటే బాద్ షా గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొంది. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటారని , అందుకే తనంటే గౌరవమని స్పష్టం చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
ప్రత్యేకించి ఈ జవాన్ సక్సెస్ క్రెడిట్ షారుక్ ఖాన్ తో పాటు అద్భుతమైన కథను తెరకెక్కించిన అట్లీ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని ప్రశంసించింది. ఏది ఏమైనా షారుక్ కు ఇది రెండో సక్సెస్ మూవీ.