Actor Navdeep : న‌వ‌దీప్ కు హైకోర్టు బిగ్ షాక్

డ్ర‌గ్స్ కేసులో పిటిష‌న్ కొట్టివేత

హైద‌రాబాద్ – టాలీవుడ్ న‌టుడు న‌వ‌దీప్ కు బిగ్ షాక్ త‌గిలింది. తాజాగా మాదాపూర్ డ్ర‌గ్స్ కేసులో త‌న‌కు ప్ర‌మేయం ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు హైద‌రాబాద్ న‌గ‌ర క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్. ఆయ‌న‌కు నోటీసులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రో వైపు ఇదే కేసుకు సంబంధించి సినీ నిర్మాత‌తో పాటు మోడ‌ల్ ప‌రార‌య్యారు. వారిని కూడా త్వ‌ర‌లో ప‌ట్టుకుంటామ‌ని తెలిపారు.

న‌గ‌రంలో న‌టుడు న‌వ‌దీప్ ప‌బ్ ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో డ్ర‌గ్స్ తీసుకుంటుండ‌గా హైద‌రాబాద్ నార్కోటిక్స్ పోలీసులు దాడి చేశారు. ప‌లువురిని అదుపులో పెట్టుకున్నారు. విష‌యం తెలుసుకున్న న‌టుడు న‌వ‌దీప్ జంప్ అయ్యాడు. అక్క‌డి నుంచి ప‌రారైన‌ట్లు సీపీ స్ప‌ష్టం చేశారు.

దీనిని ఖండించారు న‌టుడు న‌వ‌దీప్. తాను ఎక్క‌డికీ పారి పోలేద‌ని ఇక్క‌డే ఉన్నాన‌ని పేర్కొన్నారు. మ‌నోడు తెలివిగా ముంద‌స్తుగా త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా, విచారించ‌కుండా ఉండేలా హైకోర్టును ఆశ్ర‌యించాడు. పిటిష‌న్ దాఖ‌లు చేశాడు.

బుధ‌వారం న‌టుడు న‌వ‌దీప్ దాఖ‌లు చేసిన పిటిషన్ ను విచారించింది కోర్టు. డ్ర‌గ్స్ కేసులో పోలీస్ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. 41ఏ కింద న‌వ‌దీప్ కు నోటీసులు ఇవ్వాల‌ని ఆదేశించింది. అయితే అరెస్ట్ చేయొద్దంటూ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com