తమిళ సినీ రంగానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. కారణం తను హిందీలో జవన్ సినిమాను తీశాడు. ఈ చిత్రం ఊహించని రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. భారత దేశంతో పాటు విదేశాలలో సైతం దుమ్ము రేపుతోంది. ప్రధానంగా ఇందులో నటించిన షారుక్ ఖాన్ నటన పీక్ కు చేరుకుంది.
తమిళ సినీ నటి నయన తార, అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొనే, ప్రతి నాయకుడిగా విజయ్ సేతుపతి కీలక పాత్రలలో నటించారు..హృదయాలను కొల్లగొట్టారు. మరోవైపు రాక్ స్టార్ గా గుర్తింపు పొందిన అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.
తాజాగా ఈ చిత్రం రోజు రోజుకు రికార్డుల మోత మోగిస్తోంది. రూ. 1,000 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం రూ. 867 కోట్లు సాధించింది. ఇవాల్టితో రూ. 900 కోట్లలో చేరేందుకు సిద్దంగా ఉంది జవాన్. 1వ రోజు రూ. 125.05 కోట్లు వసూలు చేసింది. 2వ రోజు రూ. 109.24 కోట్లు, 3వ రోజు రూ. 140.17 కోట్లు, 4వ రోజు రూ. 156.80 కోట్లు, 5వ రోజు రూ. 52.39 కోట్లు, 6వ రోజు రూ. 38.21 కోట్లు, 7వ రోజు రూ. 34.06 కోట్లు సాధించింది.
8వరోజు రూ. 28.79 కోట్లు, 9వ రోజు రూ. 26.35 కోట్లు , 10వ రోజు రూ. 51.64 కోట్లు, 11వ రోజు రూ. 59.15 కోట్లు , 12వ రోజు రూ. 21.07 కోట్లు, 13వ రోజు రూ. 19.54 కోట్లు వసూలు చేసింది జవాన్. మొత్తం ఇప్పటి వరకు రూ. 862.54 కోట్లు సాధించి విస్తు పోయేలా చేసింది.