దుబాయ్ – సైమా అవార్డుల ప్రధానోత్సవం దుబాయ్ వేదికగా కన్నుల పండువగా జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ రంగాలకు చెందిన అతిరథ మహారథులు, నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, సినీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ పురస్కారాల వేడుక ఆద్యంతమూ కళ కళ లాడింది. తెలుగు సినీ రంగానికి సంబంధించి ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్, ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి, ఉత్తమ నటిగా శ్రీలీల, ఉత్తమ కొత్త నటి మృణాల్ ఠాకూర్ ఎంపికయ్యారు.
అంతే కాకుండా సీతారామం సినిమా అత్యుత్తమ కొత్త చిత్రంగా ఎంపికైంది. దీనిని వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కమర్షియల్ సినిమాలు టాప్ లో కొనసాగుతున్న తరుణంలో ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
కొన్ని కారణాల రీత్యా దుబాయ్ కి వెళ్ల లేక పోయారు ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఉత్తమ నటిగా సీతారామం చిత్రంలో మనసు దోచుకున్న మృణాల్ ఠాకూర్ ఎంపికైంది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులంతా ఇక్కడ కొలువు తీరారు. మొత్తంగా దుబాయ్ తారళ తళుకు బెళుకులతో నిండి పోయింది.