దుబాయ్ – సైమా అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా సాగింది దుబాయ్ వేదికగా. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినీ రంగాలకు సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, సంస్థలకు పురస్కారాలను ప్రకటించింది.
తాజాగా వెల్లడించిన అవార్డులలో కన్నడ సినీ రంగానికి సంబంధించి అత్యుత్తమ చిత్రంగా 777 చార్లీ చిత్రం ఎంపికైంది. పరంవా స్టూడియోస్ ఈ మూవీని నిర్మించింది. ఇది ఊహించని రీతిలో ప్రేక్షకుల నుండి స్పందన లభించింది ఈ చిత్రానికి .
ఒక రకంగా చెప్పాలంటే ఇది కళా ఖండంగా పేర్కొంది సైమా అవార్డ్స్ ఎంపిక కమిటీ. తొలుత అరవింద్ అయ్యర్ ను ప్రధాన నటుడిగా భావించారు. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్టు నుండి తప్పించుకున్నారు. రక్షత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించాడు. ఒక రకంగా ఇందులో నటించిన కుక్క హైలెట్ గా నిలిచింది.
తెలుగులో రానా దగ్గుబాటి సమర్పణలో పరమ్ వహ్ బ్యానర్ పై జీఎస్ గుప్తా నిర్మించాడు. సంగీత శ్రింగేరి, రాజ్ బి షెట్టి, డానిష్ సెయిట్ , బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. 777 చార్లీ సినిమాకు కిరణ్ రాజ్ దర్శకత్వం వహించారు.