Sree Leela : లవ్లీ బ్యూటీ శ్రీలీల సంచలనంగా మారింది. ఓ వైపు సినిమాలు ఆడక పోయినా తన స్టార్ ఇమేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. తను నితిన్ రెడ్డితో వెంకీ కుడుముల తీసిన రాబిన్ హుడ్ ఆశించిన మేర ఆడలేదు. కానీ అందులోని పాటలు మాత్రం బిగ్ హిట్ అయ్యాయి. ప్రత్యేకించి శ్రీలీల చేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మను తెలుగు తెరకు పరిచయం చేశాడు కె. రాఘవేంద్రరావు పెళ్లి సందడితో. హీరో శ్రీకాంత్ కొడుకుతో నటించింది. ఆ సినిమాతో మరికొన్ని సినిమాలలో ఛాన్స్ లు దక్కాయి.
Sree Leela Movie Updates
త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ధమాకా మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో మాస్ మహరాజా రవితేజ కంటే పోటీ పడి నటించింది..శ్రీలీల(Sree Leela)..మెప్పించింది. కూడా డ్యాన్సులతో ఇరగదీసింది. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో గుంటూరు కారంలో కీ రోల్ పోషించింది. కుర్చీ మడత పెట్టి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ పాట టాప్ లో కొనసాగుతోంది. ఈ సందర్బంగా మహేష్ బాబు తనతో నటించాలంటే చాలా శక్తి ఉండాలంటూ కామెంట్ చేశాడు.
విచిత్రం ఏమిటంటే తను నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడక పోయినా శ్రీలీలకు మాత్రం పెద్ద ఎత్తున సినిమాలలో నటించాలంటూ ఛాన్స్ లు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం తన చేతిలో రవితేజతో చేస్తున్న మాస్ జాతర ఉంది. హిందీలో కార్తీక్ ఆర్యన్ తో ఆషిఖి -3 మిగిలి ఉంది. తాజాగా మూవీ మేకర్స్ నుంచి సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రోమో విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎంతైనా శ్రీలీలా మజాకా అంటున్నారు ఫ్యాన్స్.
Also Read : Directors Remuneration Sensational :భారీ పారితోషకం దర్శకుల సంచలనం