Adah Sharma : దేశ వ్యాప్తంగా కేరళ స్టోరీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో నటించిన అదా శర్మ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. త్వరలోనే ఆమె అంతర్జాతీయ ప్రొడక్షన్ లో నటించనుంది. బిగ్ ఛాన్స్ దక్కింది అదా శర్మకు.
Adah Sharma Got a Good Chance
త్వరలో నటించ బోయే ఇంటర్నేషనల్ మూవీలో సూపర్ హీరో పాత్ర పోషించనుంది. ఈ విషయాన్ని నటి అదా శర్మ(Adah Sharma) ధ్రువీకరించింది. తన కెరీర్ లో ఇలాంటి గొప్ప ఛాన్స్ లభిస్తుందని తాను అనుకోలేదని పేర్కొంది. యాక్షన్ అనేది జీవితంలో భాగంగా మారిందన్నారు అదా శర్మ.
భిన్నమైన, వైవిధ్యంతో కూడుకున్న పాత్రలు చేయడం అంటే తనకు ఎంతో సరదా అని , అదే పేషన్ అంటూ పేర్కొంది నటి. కేరళ స్టోరీ వాస్తవ కథకు దృశ్య రూపం ఇచ్చారు దర్శకుడు. ఆ సినిమా సక్సెస్ కావడం వెనుక ప్రధాన కారణం డైరెక్టరే అంటూ కొనియాడారు.
త్వరలోనే తన కొత్త ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు తెలియ చేస్తానని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా అదా శర్మ నటించిన కేరళ స్టోరీ ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో రూ. 238 కోట్లు వసూలు చేసింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
Also Read : Nag Ashwin : అంచనాలకు మించి ‘కల్కి’ – నాగ్