Gunuturu Karam : గుంటూరు కారం సంక్రాంతికి ప‌క్కా

స్ప‌ష్టం చేసిన ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్

Hellotelugu-Gunuturu Karam

Gunuturu Karam : ప్రిన్స్ మ‌హేష్ బాబు, శ్రీ‌లీలతో క‌లిసి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ గుంటూరు కారం పేరుతో సినిమా తీస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే ప‌రుశురామ్ తీసిన స‌ర్కారు వారి పాట బిగ్ హిట్ గా నిలిచింది.

Gunuturu Karam Updates

ఆ త‌ర్వాత మ‌హేష్ బాబు న‌టిస్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం. అంత‌కు ముందు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు చేశాడు ప్రిన్స్. త‌న సినీ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది అత‌డు. ఆ త‌ర్వాత ఖ‌లేజా అంత‌టి స‌క్సెస్ అందుకోలేక పోయినా యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది.

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు ఎక్కువ‌గా గుంటూరు కారంపై(Gunuturu Karam) ఫోక‌స్ పెట్టాడు. ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్స్ , టీజ‌ర్ రిలీజ్ చేశాడు ద‌ర్శ‌కుడు. భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా షెడ్యూల్ కూడా ప్రారంభ‌మైంది. శుక్ర‌వారం త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ట్విట్ట‌ర్ వేదిక‌గా గుంటూరు కారం చిత్రానికి సంబంధించి ఓ అప్ డేట్ ఇచ్చారు.

సెప్టెంబ‌ర్ 10న మ‌హేష్ బాబుతో అద్భుత‌మైన ఫైటింగ్ సీన్స్ తీయ‌బోతున్నామ‌ని తెలిపాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ . ఇదే స‌మ‌యంలో వ‌చ్చే ఏడాది 2024న సంక్రాంతికి గుంటూరు కారం ప‌క్కా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించాడు. దీంతో ప్రిన్స్ మ‌హేష్ బాబు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

Also Read : Mahesh Babu : ప్రిన్స్ షాక్ జ‌వాన్ కిర్రాక్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com