Coolie : తాజాగా రజనీకాంత్ నటించిన చిత్రం కూలీ(Coolie) షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదలకు సిద్దంగా ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఏకంగా రూ. 240 కోట్లకు పైగా పెట్టి తీయడం విశేషం. దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న నటుడు కావడంతో రజనీ నటించిన కూలీ మూవీ భారీ ధరకు ఓటీటీ సంస్థ చేజిక్కించుకున్నట్లు టాక్. ఇప్పటికే విజయ్ తన చివరి చిత్రం జన నాయగన్ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ రూ. 121 కోట్లకు కైవసం చేసుకోవడం విస్తు పోయేలా చేసింది. అంతకు ముందు మరో సంస్థ కూలీని రూ. 120 కోట్లకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Coolie Movie OTT Rites
ఇక సినిమా విషయానికి వస్తే ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ రజనీకాంత్ కు మరింత ఇమేజ్ పెంచేలా చేశాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. తనకు ఇష్టమైన నటుడు విజయ్. ఇదే సమయంలో రజనీ సార్ తో చేయాలని కల ఉండేదని, అది తీరి పోయిందన్నాడు. కథ, డైరెక్షన్ అంతా తనే. సంభాషణలు చంద్రు అన్నగళన్ రాశాడు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించాడు కూలీని. ఇందులో రజనీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతీ హాసన్ నటిస్తున్నారు. సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించాడు.
Also Read : Popular Director Krishna Vamsi :ప్రేమ కథపై కృష్ణ వంశీ ఫోకస్