Chiranjeevi : టాలీవుడ్ లో టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో నటించనున్న న్యూ మూవీ ప్రారంభమైంది. విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టడం విశేషం. తనతో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడు అనిల్ రావిపూడి. మెగా ఫ్యాన్స్ కు మంచి ఊపును తీసుకు వచ్చేలా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించాడు. దీంతో రిలీజ్ కాకుండానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథతో పాటు కడుపుబ్బా నవ్వించే టాలెంట్ కలిగిన దర్శకుడు తను. తనపై భారీ నమ్మకాన్ని కలిగి ఉన్నారు చిరంజీవి(Chiranjeevi). ఎందుకంటే టైమింగ్ , కనెక్టివిటీ ఉండే టాలెంట్ స్వంతం అనిల్ రావిపూడిది.
Chiranjeevi Movie Updates
ఇక చిరంజీవి సినీ ప్రస్థానంలో ఈ చిత్రం 157వది కావడం విశేషం. ఇప్పటికే తను నటించిన విశ్వంభర మూవీ రిలీజ్ కు సిద్దమైంది. ఆ వెంటనే అనిల్ కు ఓకే చెప్పడం, సినిమా షూటింగ్ ప్రారంభం కావడం విస్తు పోయేలా చేసింది టాలీవుడ్ ను. ఇదిలా ఉండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్ , మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 300 కోట్లు వసూలు చేసింది. సినీ ప్రముఖులను విస్తు పోయేలా చేసింది.
ఇక దర్శకుడు పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించ బోతున్నాడు చిరంజీవిని . తను ఇప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ ప్రారంభించడం విశేషం. మెగాస్టార్ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సాహు గారపాటి, సుష్మిత కొణిదల అనిల్ రావిపూడి చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ఈ మూవీ పక్కాగా ఇంటిల్లిపాదిని నవ్వించేలా చేస్తానంటూ ప్రకటించాడు అనిల్ రావిపూడి. 2026 సంక్రాంతి పండుగ రోజున పక్కాగా రిలీజ్ చేస్తామని స్పష్టం చేశాడు.
Also Read : Beauty Tamannaah-Raid 2 :ఐటం సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా