Anirudh Ravichander : అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ దుమ్ము రేపుతోంది. గురువారం ప్రపంచ వ్యాప్తంగా మూవీ విడుదలైంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి నటించారు. మ్యూజికల్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.
Anirudh Ravichander Songs Viral
రూ. 220 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అట్లీ అద్భుతమైన టేకింగ్ , యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించడంతో కాసులు కొల్లగొడుతోంది. ఇక సక్సెస్ ఫుల్ సినిమాలకు వరుసగా మ్యూజిక్ అందిస్తూ వచ్చిన అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) తాజాగా జవాన్ కు కూడా మ్యూజిక్ అందించాడు.
ఇవాళ రిలీజైన జవాన్ తొలి షో నుంచే కాసులు కొల్లగొడుతూ దూసుకు పోతోంది. బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మూవీకి పాజిటివ్ టాక్ , రేటింగ్స్ ఇచ్చారు. దీంతో ఈ ఏడాది షారుక్ ఖాన్ కు ఇది రెండో మూవీ అవుతుంది. తొలి సినిమా పఠాన్. అది రూ. 1,000 కోట్లు కొల్లగొట్టింది. తాజాగా రిలీజ్ అయిన జవాన్ ఆ దిశగా పరుగులు తీయడం ఖాయమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
షారుక్ ఖాన్ , నయన తార నటన, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి స్పెషల్ అప్పీయరెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. అన్నింటికి మించి బీజీఎం, మ్యూజిక్ వహ్వా అనే రీతిలో ఉండడంతో సక్సెస్ పక్కా అని టాక్ నడుస్తోంది.
Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ తో గబ్బర్ సింగ్