Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన ఎమ్మెల్సీ , ప్రముఖ నటి విజయ శాంతి గురించి పేర్కొంటూ తను తనకు తల్లి లాంటిదని స్పష్టం చేశాడు. ఆమె నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు. తాజాగా తను నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో కళ్యాణ్ రామ్(Kalyan Ram), విజయశాంతి కలిసి నటించారు. గతంలో కూడా ఈ ఇద్దరూ కలిసి పని చేశారు. ఈ సినిమాలో కలిసి పని చేయడం వల్ల తామిద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగిందన్నాడు నటుడు.
Kalyan Ram Comment about Vijayasanthi
తను నటించిన బింబిసార మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, సాంగ్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్రం ఈవెంట్ సందర్బంగా కళ్యాణ్ రామ్ తన మనసులోని మాటను బయటకు చెప్పేశాడు. విజయశాంతితో నటించడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమా ప్రత్యేకించి తల్లీ కొడుకుల మధ్య ఉంటుందన్నాడు.
ఈ ఇద్దరూ ఎందుకు దూరమయ్యారు..? దానికి గల కారణాలు ఏంటి..? తిరిగి ఎలా కలుసుకున్నారు..? దాని వెనుక ఉన్న కథేమిటి అనేదే అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రమన్నాడు కళ్యాణ్ రామ్. విజయశాంతి ఈ చిత్రానికి బలమని, పోరాట సన్నివేశాలలో అద్భుతంగా నటించిందని కొనియాడారు. కళ్యాణ్ రామ్ తన గురించి చేసిన కామెంట్స్ కు సంతోషం వ్యక్తం చేశారు రాములమ్మ. కళ్యాణ్ కు ఎలా గౌరవించాలో తెలుసు. అంతే కాదు కొత్త దర్శకులను పరిచయం చేయడంలో తను అందరికంటే ముందుంటాడని ప్రశంసించారు. తాజాగా ఈ సినిమా ద్వారా ప్రసాద్ పరిచయం అవుతున్నాడని, తనకు మంచి భవిష్యత్తు ఉందన్నారు విజయశాంతి.
Also Read : Popular Actor Mohan Babu-Kannappa :కన్నప్ప మోహన్ బాబు బర్త్ డే స్పెషల్