Annapurna : ప్రముఖ నటి అన్నపూర్ణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమిట్మెంట్ గురించి స్పందించారు. కొందరు కావాలని దీని గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారని, ఇదంతా కేవలం మీడియాలో హైలెట్ అయ్యేందుకే ఇలా చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఆ రోజుల్లో ఇలాంటివి లేవన్నారు. విలువలతో కూడి కూడిన కమిట్మెంట్స్ ఉండేవని చెప్పారు. తమకు ఇచ్చిన పాత్రలకు ఎలా న్యాయం చేయాలనే దానిపై ఎక్కువగా దృష్టి సారించే వారమని అన్నారు.
Annapurna Shocking Comments
అప్పటికీ ఇప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ మారి పోయిందన్నారు నటి అన్నపూర్ణమ్మ(Annapurna). తక్కువ పారితోషకం ఇచ్చినా పని చేసుకుంటూ పోయామే తప్పా ఏనాడూ రచ్చకు ఎక్కింది లేదన్నారు. ఇవాళ నటన రాని వాళ్లు కూడా రాద్దాంతం చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందన్నారు. మన పరిధిలో మనం ఉంటే ఎవరూ మన జోలికి రారని, ఆవిషయం తెలుసుకుని పని చేస్తే ఎక్కడైనా అవకాశాలు వాటంతట అవే వస్తాయని స్పష్టం చేశారు అన్నపూర్ణమ్మ.
కమిట్మెంట్ అనేది మన మనస్సుపై ఆధారపడి ఉంటుందన్నారు. సినీ ఇండస్ట్రీలో కావాలని ఎవరూ ఎవరినీ బలవతం చేయరని చెప్పారు సీనియర్ నటి. తను ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలో నటిస్తోంది. చాలా బిజీగా ఉన్నారు. మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Court Movie Sensational :కోర్ట్ చిత్రం కలెక్షన్ల వర్షం