Court : యాక్టర్ నాని చెప్పినట్టుగానే కోర్ట్ సినిమా ఆశించిన దానికంటే అద్భుతంగా ఆడుతోంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఫస్ట్ డే రోజే ఏకంగా ఈ చిత్రం రూ. 8.3 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు కూడా అదే స్థాయిలో వసూలు చేసింది. మొత్తంగా రూ. 15 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ప్రియదర్శి నటన ఇందులో హైలెట్ గా నిలిచింది. ఇప్పటికే సహజ సిద్దమైన నటనకు పేరు పొందాడు నటుడు. కోర్ట్(Court) ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా నటుడు నాని సంచలన కామెంట్స్ చేశాడు.
Court Movie Sensational
కోర్ట్ చిత్రం చూడండి. ఒకవేళ నచ్చక పోతే తాను నటించిన హిట్ 3 మూవీ చూడకండి అంటూ సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. దీంతో కోర్ట్ మూవీపై భారీ అంచనాలు పెరిగేలా చేశాయి తను చేసిన వ్యాఖ్యలతో. ఒక రకంగా నాని ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారాడు. కథను అద్బుతంగా చెప్పడంలో, సినిమాగా మల్చడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ప్రధానంగా కోర్ట్ కు సంబంధించిన చట్టాలు, వాటి వెనుక అర్థాలు, ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యల గురించి చిత్రంలో అర్థం చేయించేందుకు ప్రయత్నం చేశాడు. ఇది బాగా నచ్చేలా చేసింది. పోక్సో చట్టంపైనే మూవీ ఫోకస్ పెట్టింది. అకారణంగా ఇరుక్కు పోతే , శిక్షకు గురైతే ఎదురయ్యే సవాళ్లు ఏమిటి. జీవితంలో ఇలాంటి వాటిని ఎదుర్కొని ఇబ్బంది పడుతున్న వారి కోసమే దీనిని తీశానని చెప్పాడు డైరెక్టర్.
చిన్న లవ్ స్టోరీ చుట్టూ కథను అల్లాడు. దానిని తెర పై అందంగా ఎక్కించాడు డైరెక్టర్. రామ్ జగదీశ్ దీనికి ప్రాణం పోశాడని చెప్పక తప్పదు. ఇందులో ప్రియదర్శితో పాటు చాన్నాళ్ల తర్వాత శివాజీ , సాయి కుమార్, హర్ష వర్దన్ , రోహిణి నటించారు. నాని కోర్ట్ కోసం మద్దతుగా నిలిచాడు. తను చేసిన ప్రయత్నం ఫలించింది. బిగ్ సక్సెస్ మూట గట్టుకుంది.
Also Read : Hero Karthi-Gautham Menon :గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కార్తీ