Kalyan Ram : టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు నందమూరి కళ్యాణ్ రామ్. తను నటుడిగానే కాదు నిర్మాత కూడా. తన సోదరుడు పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరను కూడా నిర్మించాడు. ఈ సినిమాను కొరటాల శివ తీశాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కీలక పాత్రలో నటించింది. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో దీనిని సీక్వెల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు. ఇక కళ్యాణ్ రామ్(Kalyan Ram) టాలెంట్ ఉన్న వాళ్లను ప్రోత్సహించడంలో ముందుంటాడు. అలాంటి వారిలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా పేరు పొందాడు అనిల్ రావిపూడి. తనకు పటాస్ తీసేలా అవకాశం ఇచ్చాడు.
Kalyan Ram Arjun s/o Vyjayanthi Movie
తాజాగా తాను నటిస్తున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. పోస్టర్ కు మంచి ఆదరణ లభించింది. ఇక టీజర్ కు భారీ స్పందన లభించడంతో సంతోషానికి లోనవుతున్నారు నందమూరి ఫ్యాన్స్. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక్ వర్దన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. భారీ ఖర్చుతో దీనిని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు డైరెక్టర్.
ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు ప్రదీప్. ఇందులో మరో కీలక పాత్రలో నటిస్తోంది సాయి మంజ్రేకర్. సోహైల్ ఖాన్ విలన్ గా నటిస్తుండడం విశేషం. త్వరలోనే పూర్తి చేసి వెంటనే రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు దర్శక, నిర్మాతలు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అద్భుతంగా వచ్చిందంటూ ఇప్పటికే సినీ రంగంలో టాక్.
Also Read : 3 Roses Sensational :ఆహాలో 3 రోజెస్ హల్ చల్