Kushboo : బహు భాషా నటిగా గుర్తింపు కలిగిన నటి ఖుష్బు సుందర్(Kushboo). తనకు తమిళనాడులో భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. తన కోసం ప్రాణం ఇవ్వమంటే ఇచ్చేవాళ్లు రెడీగా ఉన్నారంటే ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఏకంగా మాజీ సీఎం , దివంగత జయలలిత కోసం అక్కడ గుడిని కట్టారు. ఆ తర్వాత ఒక సినీ నటికి బహిరంగంగానే మద్దతు ఇస్తూ ఆలయాన్ని నిర్మించడం ఒక్క ఖుష్బు సుందర్ తోనే సాధ్యమైంది. అంతలా ఆమె అంటే పడి చస్తారు.
Kushboo Special Attraction at..
తను నటిగా కంటే రాజకీయ నాయకురాలిగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆమె పుట్టుకతో ముస్లిం. తర్వాత హిందు సుందర్ ను పెళ్లి చేసుకుంది. తనకు దేవుడంటే నమ్మకం లేదు. కానీ రాను రాను దైవం, మతాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తన ప్రస్తుత వయసు 54 ఏళ్లు. సెప్టెంబర్ 29 1970లో పుట్టింది. తన చిన్నప్పటి పేరు నఖత్ ఖాన్. మహారాష్ట్ర లోని పశ్చి మ అంధేరిలో జన్మించింది.
1989 నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఇద్దరు పిల్లలు. తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది ఎక్కువగా సినిమాలలో. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసిలో తళుక్కున మెరిసింది. వెంకటేష్ తో కలియుగ పాండవులు, పేకాట పాపారావు, చిరంజీవి నటించిన స్టాలిన్ , రాక్షస సంహారాం, జయసింహ, తేనెటీగ, పెద్దన్న, రామబాణం, తదితర సినిమాలలో కీలక పాత్రలు పోషించింది ఖుష్బు సుందర్. మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలందరికీ తను శుభాకాంక్షలు తెలిపారు. సమాజం పట్ల అవగాహన ఉంది. తను గొప్ప హేతువాది.
Also Read : Jayaprada Simply Super :సినీవాలిలో జయప్రద నవోన్మిక