Jayasudha : సహజ నటి ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మొదటి పేరు తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించి ఎవరైనా సరే జయసుధ(Jayasudha) పేరు చెప్పేస్తారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో లీనమై పోయి నటించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ నాయకురాలిగా కూడా ఉన్నారు. ప్రధానంగా తొలి నాళ్లల్లో నటిగా ప్రారంభించింది. రాను రాను తను తల్లి పాత్రలకు అంకితమై పోయింది. పలు పార్టీలు మారింది. ఆ తర్వాత తను క్రిష్టియన్ గా మారింది. ఇది చాలా మందిని విస్తు పోయేలా చేసింది.
Jayasudha…
జయసుధ అసలు పేరు సుజాత. డిసెంబర్ 17న మద్రాసులో పుట్టింది. అక్కడ పుట్టినా తన తల్లి భాష తెలుగు. నటి, నిర్మాత అయిన దివంగత విజయ నిర్మల తనకు మేనత్త అవుతుంది. తను ఇప్పుడు లేరు. ఆమె ఎవరో కాదు దివంగత నటుడు కృష్ణకు భార్య. తమ కొడుకు ప్రస్తుత కమెడియన్, నటుడిగా గుర్తింపు పొందిన నరేష్.
1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ మొదటి చిత్రం. జయసుధ ఇప్టపి వరకు 300కు పైగా సినిమాలలో నటించింది..వేలాది మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించింది. 20 తమిళం, 8 మలయాళం, 3 హిందీ, ఒక కన్నడ సినిమాలో నటించింది జయసుధ.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించింది. ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన సినిమాలు 25 విడుదల కావడం రికార్డ్ సృష్టించడం విశేషం. 1985లో నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 2001లో క్రైస్తవ మతం పుచ్చుకున్న తను ఓ ట్రస్టును స్థాపించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు పొందింది. మహిళా దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు జయసుధ.
Also Read : Jayaprada Simply Super :సినీవాలిలో జయప్రద నవోన్మిక