Kharge : ఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం, ముఖ్యమంత్రి పదవి మార్పునకు సంబంధించిన అంశంపై తీవ్రంగా స్పందించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని స్పష్టం చేశారు. వ్యక్తులు, నేతలు, కార్యకర్తలు పార్టీలోకి వస్తుంటారు వెళుతుంటారని కానీ పార్టీ అలాగే ఉంటుందన్నారు. సీఎం మార్పు అంశం గురించి ఇంకా ఆలోచించ లేదన్నారు ఖర్గే (Kharge). దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా కీలక మీటింగ్ జరగలేదని పేర్కొన్నారు. కన్నడ నాట తమ సర్కార్ పూర్తి కాలం ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Mallikarjun Kharge Shocking Comments
ఇతర పార్టీలలో నియంతృత్వం ఉంటుందని, కానీ తమ కాంగ్రెస్ పార్టీలో అపరితమైన స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఆస్కారం కలుగుతుందని తెలిపారు. పార్టీ ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు అపారమైన నమ్మకం పెట్టుకుని ఉన్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ సర్కార్ ప్రయత్నం చేసిందని చెప్పారు ఖర్గే. సీఎం పోస్టు కీలకమైనదని దానిని ప్రతి ఒక్కరూ ఆశించడంలో తప్పు లేదన్నారు. అలా అని రాజకీయ సంక్షోభం నెలకొందని చెప్పడం , కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పరోక్షంగా పీఎంను ఉద్దేశించి పేర్కొన్నారు.
Also Read : DK Shivakumar Important Update : సీఎం మార్పుపై పార్టీ హైకమాండ్ దే ఫైనల్















