Raveena Tandon : బాలీవుడ్ నటి రవీనా టాండన్ సీరియస్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆమె కత్రీనా కైఫ్ కు మద్దతు పలికారు. తను ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభ మేళా సందర్బంగా పవిత్ర స్నానం చేశారు. తన కుటుంబంతో కలిసి. ఇదే సమయంలో అక్కడున్న కొందరు భక్తులు తనకు తెలియకుండా వీడియోలు, ఫోటోలు తీశారు. దీనిని గమనించలేదు నటి కత్రీనా కైఫ్.
Raveena Tandon Shocking Comments
ఆమె స్నానం చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో తీవ్రంగా స్పందించారు రవీనా టాండన్(Raveena Tandon). పవిత్ర స్నానం చేస్తుంటే ఎవరైనా ఫోటోలు, వీడియోలు తీస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా మీ సంస్కారం అంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు రవీనా .
ఇతరులకు కూడా ప్రైవసీ అనేది ఉంటుందని, ప్రత్యేకించి హోలీ ప్లేస్ లో స్నానం చేయడం కూడా ఇబ్బందిగా మారిపోతే ఇంకెవరూ బయటకు రారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అభిమానం చూపడంలో, ఆరాధించడంలో తప్పు లేదని , కానీ ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తించడం, ఫోటోలు, వీడియోలు తీయడం, ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
కత్రీనా కైఫ్ మౌనంగా ఊరుకుంది కానీ తాను గనుక అక్కడ ఉండి ఉంటే చెంప ఛెల్లుమనిపించే దానినంటూ స్పష్టం చేసింది.
Also Read : Oscar Awards 2025 Sensational :ప్రశంసలు అందుకున్న ‘అనుజ’