Javed Akthar : బాలీవుడ్ దిగ్గజ గేయ రచయిత జావేద్ అక్తర్ తీవ్రంగా స్పందించాడు. దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్బంగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో భారత జట్టు చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది. దీంతో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కొనసాగుతోంది. పలువురు పాకిస్తాన్ ను గేలి చేయడాన్ని తప్పు పట్టాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎక్స్ లో.
Javed Akthar Shocking Comments
దీంతో జావేద్ అక్తర్(Javed Akthar) ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీనికి గట్టిగా సమాధానం ఇచ్చాడు. నేను అసలైన భారతీయుడిని, ఎవరైతే తనను విమర్శిస్తారో వారు నిజమైన దేశ భక్తులు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. కళకారులు, క్రీడాకారులకు, చిత్రకారులు, నటీ నటులకు ఎలాంటి కులాలు, మతాలు , జాతులు అంటూ ఉండవని స్పష్టం చేశాడు. ప్రపంచంలోని ప్రతి కళాకారులంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారేనని గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.
ఈ దేశం కోసం పోరాడుతున్న సమయంలో జైలు పాలైంది ఎవరో మీకు తెలుసా. చరిత్ర తెలుసు కోకుండా అభాండాలు వేస్తే ఎలా అని జావేద్ అక్తర్ ప్రశ్నించారు. సోషల్ మీడియా ఉంది కదా అని ఎలా పడితే అలా విమర్శలు గుప్పిస్తే మీరు నిజమైన భక్తులు అవుతారా అని నిలదీశారు. ఈ సందర్బంగా విరాట్ కోహ్లీ తన కెరీర్ లో అత్యంత వేగవంతంగా 14,000 పరుగులు పూర్తి చేయడంపై ప్రశంసించాడు. దీనిపై కొందరు ట్రోల్ చేయడాన్ని తప్పు పట్టారు.
ఈ సందర్బంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. నాలో ప్రవహిస్తున్న రక్తం భారత దేశం అన్నారు జావేద్ అక్తర్
Also Read : Hero Thalapathy Vijay :విజయ్ బ్లాక్ బస్టర్ మూవీ రీ రీలీజ్