Virat Kohli : దుబాయ్ – ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) విశ్వ రూపాన్ని ప్రదర్శించాడు. అజేయ శతకంతో కీలక పాత్ర పోషించాడు. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఎక్కడా పాకిస్తాన్ బౌలర్లు ప్రభావం చూపలేక పోయారు. దీంతో టోర్నీలో భాగంగా రెండు మ్యాచ్ లలో పరాజయం పాలై నిష్క్రమించింది పాకిస్తాన్.
Virat Kohli Victory in IND vs PAK Match
భారత్ గ్రాండ్ విక్టరీ నమోదుతో దేశ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. అభిమానులు పూజలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. భారతీయ జెండాల రెపరెపలతో హోరెత్తించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ స్కిప్పర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 241 పరుగులకే ఆలౌటైంది. కులదీప్ యాదవ్ 3 కీలక వికెట్లు తీశాడు.
అనంతరం 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయినా శుభ్ మన్ గిల్ 46 రన్స్ చేస్తే విరాట్ కోహ్లీ దుమ్ము రేపాడు. తన కెరీర్ లో 51వ సెంచరీ చేశాడు. 111 బంతులు ఎదుర్కొని 100 రన్స్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 42.3 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. టీమిండియా రెండు మ్యాచ్ లు విజయం సాధించింది. నేరుగా సెమీ ఫైనల్ కు చేరుకుంది.
Also Read : Victory Venkatesh SVSC :సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్