Sandeep Kishan : త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్(Sandeep Kishan), రితు వర్మ, రావు రమేష్ , అషు కీలక పాత్రల్లో నటించిన మజాకా చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆద్యంతమూ ఇంటిల్లిపాది నవ్వుకునేలా తీశాడు దర్శకుడు. ఈ మధ్యనే ఈవెంట్ సందర్బంగా తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రత్యేకించి 20 ఏళ్ల గ్యాప్ తర్వాత మన్మధుడులో తళుక్కున మెరిసిన అషు ఉన్నట్టుండి మజాకాలో ప్రత్యక్షమైంది. ఈ సందర్బంగా డైరెక్టర్ నోరు పారేసుకున్నాడు.
Sandeep Kishan Mazaka Movie Updates
అషు తన అందాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నాడు. లేకపోతే ఇక్కడి ప్రేక్షకులు ఒప్పుకోరంటూ పేర్కొన్నాడు. దీంతో మహిళలు, మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రోల్ కు గురయ్యాడు. దెబ్బకు మనోడు దిగి వచ్చాడు. మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాడు.
తాజాగా తను మనసు పెట్టి తీసిన మజాకా చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇది తప్పకుండా హిట్ కావడం పక్కా అనే నమ్మకంతో ఉన్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్, పాటలు, టీజర్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి.
తాజాగా మజాకా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పూర్తిగా నవ్వులు పూయించేలా చేయడంలో దర్శకుడు త్రినాథరావు సక్సెస్ అయ్యాడని చెప్పక తప్పదు. గతంలో మాస్ మహరాజా రవితేజ, లవ్లీ బ్యూటీ శ్రీలీలతో ధమాకా తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు మజాకా తీసుకు వస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Beauty Kriti Sanon :ఇంకొకరు చేస్తే నేను ఒప్పుకోను