Victory Venkatesh : బుల్లి తెర అభిమానులకు, ఓటీటీ ఫ్యాన్స్ కు తీపికబురు చెప్పింది జీ గ్రూప్. తెలుగు సినిమా చరిత్రలో ఈ ఏడాది 2025లో తొలి బ్లాక్ బస్టర్ అయిన చిత్రంగా వినుతికెక్కింది విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh) , ఐశ్వర్య రాజేశ్ , మీనాక్షి చౌదరి, బుల్లిరాజు కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. అన్ని సినిమాలను తోసిరాజని ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది.
Victory Venkatesh ‘Sankranthiki Vasthunnam’ OTT Updates
దీనితో పాటు మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన గేమ్ ఛేంజర్ బొక్క బోర్లా పడింది. ఇక నందమూరి బాలయ్య , శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా , మీనాక్షి చౌదరి నటించిన డాకు మహారాజ్ సక్సెస్ గా నిలిచింది. ఇది రూ. 150 కోట్లు వసూలు చేసినట్లు టాక్. మూడు బిగ్ సినిమాలు విడుదలైతే ఇందులో రెండింటిని నిర్మించారు దిల్ రాజు. ఒకటి గేమ్ చేంజర్ కాగా మరోటి సంక్రాంతికి వస్తున్నాం.
గేమ్ ఛేంజర్ కొట్టిన దెబ్బకు ఇంకొకరైతే పడి పోవాల్సిందే..కానీ సంక్రాంతికి వస్తున్నాం ఆదుకుంది దిల్ రాజు, శిరీష్ లను. ఇక ఓటీటీ సంస్థలు భారీ ధరకు పోటీ పడ్డాయి సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని స్వంతం చేసుకునేందుకు. కానీ జీగ్రూప్ స్వంతం చేసుకుంది. తాజాగా అధికారికంగా ప్రకటించింది. మార్చి 1న సంక్రాంతికి వస్తున్నాం జీ తెలుగులో టెలికాస్ట్ చేస్తున్నామని, ఆ తర్వాత జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ఉంటుందని ప్రకటించింది.
Also Read : Trivikram Son – Spirit :’వంగా’ వద్ద త్రివిక్రమ్ కొడుకు శిష్యరికం