Ramam Raghavam : ఈ మధ్యన తెలుగులో భిన్నమైన పాత్రులతో సినిమాలు వస్తున్నాయి. అంతకు మించి భావోద్వేగాలను ప్రతిఫలించేలా కథలను ప్రజెంట్ చేస్తున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రామం రాఘవం. సినిమాల్లో కమెడియన్ గా, జబర్దస్త్ లో ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న ధన్ రాజ్(Dhanraj) ఈ సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా మారాడు.
Ramam Raghavam Movie Updates
తనలోని ప్రతిభకు పదును పెట్టేలా ప్రయత్నం చేశాడు. ఇందులో తండ్రీ కొడుకులుగా బాండింగ్ ను గొప్పగా చూపించాడు. ఒక్కోసారి కన్నీళ్లు పెట్టిస్తాడు కూడా. తండ్రిగా తమిళ సినీ ఇండస్ట్రీలో దర్శకుడు, నటుడైన సముద్ర ఖని నటించాడు. తను కూడా ఈ పాత్ర పట్ల భావోద్వేగానికి లోనయ్యాడు.
జీవితంలో మనం ఎన్నో అడుగులు వేస్తాం. కానీ ఈ వేసే అడుగులో కొన్ని తప్పేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇంకోసారి అయినవాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. దూరం పెరిగే కొద్దీ మనుషుల మధ్య మరింత దగ్గరయ్యేందుకు కోరిక ఏర్పడుతుంది. ఇదే క్రమంలో తండ్రీ కొడుకుల మధ్య బంధం విడదీయనిది. ఇద్దరి మధ్య ఉన్న లింక్ ను కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నం చేశాడు ధన్ రాజ్.
అదే రామం రాఘవం.
ఈ చిత్రంలో ధన్ రాజ్ , సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తే హరీష్ ఉత్తమన్, సత్య, ప్రమోదిని, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీరాజ్, సునీల్, మోక్ష, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్టేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై పృథ్వీ పోలవరపు రామం రాఘవంను నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 21న తెలుగు, తమిళంలో విడుదలైంది.
Also Read : Hero Dhanush Movie : జాబిలమ్మ నీకు అంత కోపమా