Director Shankar : తమిళ సినీ దిగ్గజ దర్శకుడు శంకర్ కు కోలుకోలేని షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారికంగా దర్శకుడి ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో మొత్తం తనకు చెందిన రూ. 10 కోట్ల 10 లక్షల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు వెల్లడించింది.
Director Shankar Properties
ఫిబ్రవరి 17న దర్శకుడు శంకర్(Director Shankar) కు చెందిన ఆస్తులను జప్తు చేశామని, ఈ విషయాన్ని ఆయనకు కూడా తెలియ చేశామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా డైరెక్టర్ శంకర్ ఓ సినిమా కాపీ రైట్ ఉల్లంఘనకు పాల్పడ్డాడని, విచారణలో ఇది నిజమని తేలి పోయిందని, అందుకే ఆస్తులను జప్తు చేయాల్సి వచ్చిందని తెలిపింది ఈడీ.
విచిత్రం ఏమిటంటే కాపీ రైట్ ఇష్యూకు సంబంధించి ఆస్తులను జప్తు చేయడం సినీ చరిత్రలో ఇదే తొలిసారి అని కూడా దర్యాప్తు సంస్థ ధ్రువీకరించింది. గతంలో శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో చిత్రంలో నటించాడు. అయితే ఈ కథను జిగుబా అనే పుస్తకం నుంచి మక్కీకి మక్కీ శంకర్ కాపీ కొట్టాడంటూ తమిళనాడుకు చెందిన తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో కోర్టుకు ఎక్కాడు. తను కాపీ రైట్ కు పాల్పడ్డాడంటూ ఆరోపించాడు.
రోబో సినిమాకు ఈ పుస్తకంలోని కథకు సామీప్యత ఉందని ఎఫ్టీఐఐ స్పష్టం చేసింది. దీంతో ఈడీ ఆస్తులను జప్తు చేసింది.
Also Read : Hero Chiranjeevi Mother :మెగాస్టార్ మదర్ కు అస్వస్థత