Swetha Basu : రంగుల ప్రపంచం సినిమా లోకం. ఇక్కడికి ఎన్నో ఆశలతో వస్తుంటారు. ప్రత్యేకించి హీరోయిన్లుగా, అతిథి పాత్రల్లో నటించాలని ఉవ్విళ్లూరుతుంటారు. చాలా మంది అదృష్టంపై ఆధార పడితే మరికొందరు ఊహించని రీతిలో రాణించిన వాళ్లున్నారు. ఇంకొందరు ఛాన్స్ ల కోసం సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు కోకొల్లలు. కొందరు బయట పడితే, మరికొందరు చెప్పుకోలేక, ఎప్పుడో ఒకసారి అవకాశం దక్కుతుందనే ఆశతో బతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
Swetha Basu Prasad Shocking Comments
సినిమా రంగంలో ఇప్పుడు హీరోలు , దర్శకులు, నిర్మాతల వేధింపుల పర్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రధానంగా తమిళ సినీ రంగానికి చెందిన ఫేమస్ సింగర్ చిన్మయి శ్రీపాద సైతం ప్రముఖ గేయ రచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ బహిరంగంగానే చెప్పేసింది. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది.
ఇక నటి పూనమ్ కౌర్ అయితే సంచలన కామెంట్స్ చేసింది. ఆమె ఏకంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేసింది. తనను మోసం చేశాడంటూ వాపోయింది. ఈ తరుణంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటి శ్వేత బసు ప్రసాద్(Swetha Basu) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ హీరో తనను బాడీ షేమింగ్ చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బాంబు పేల్చింది. ఆమె ఆ మధ్యన వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. తను బంగారు లోకం చిత్రంలో నటించింది.
Also Read : Chathuram OTT Sensational :ఓటీటీని షేక్ చేస్తున్న చతురం