Tiger3 Movie : బాలీవుడ్ కళ కళ లాడుతోంది. ఇద్దరు దిగ్గజ నటులు షారుక్ ఖాన్ , సల్మాన్ ఖాన్ చేసిన సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అట్లీ కుమార్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఇక కింగ్ గా పిలుచుకునే సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ -3 చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మేరకు తాజాగా మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు.
Tiger3 Movie Updates
ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి దీపావళి కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. పులి సిద్దంగా ఉంది ఇక గర్జించేందుకు సిద్దంగా ఉందంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా సిద్దం చేశారు.
సల్మాన్ ఖాన్ , కత్రినా కైఫ్ కలిసి నటించిన తొలి చిత్రం ఏక్ థా టైగర్. ఇది 2012లో విడుదలైంది. భారీ సక్సెస్ ను మూటగట్టుకుంది. ఆ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా టైగర్ జిందా హై పేరుతో 2017లో రిలీజ్ చేశారు. ఇది కూడా బిగ్ సక్సెస్ అయ్యింది. హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. యష్ రాజ్ ఫిలింస్ స్పై చిత్రాలకు ప్రసిద్ది పొందాయి.
టైగర్ 3(Tiger3 Movie) చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. దీనిని ఆదిత్యా చోప్రా నిర్మించారు. అక్షయ్ విధాని సహ నిర్మాతగా వ్యవహరించారు. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే చేపట్టారు. ప్రీతమ్ సంగీతం అందించారు. ఇరాద్ కమిల్, అమిత్ భట్టాచార్య సాహిత్యం అందించారు.
Also Read : Tamannah Bhatia : మాల్దీవుల్లో మిల్కీ బ్యూటీ