Sreeleela : కన్నడ బ్యూటీ శ్రీలీల దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకునే ప్రయత్నంలో బిజీగా ఉంది. గుంటూరు కారంలో మహేష్ బాబు తో నటించిన ఈ ముద్దుగుమ్మ కిసక్ అంటూ పుష్ప2లో స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసింది.
ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది పూర్తిగా రొమాంటిక్, థ్రిల్లర్ నేపథ్యంగా కొనసాగనుంది.
Sreeleela Got Offer
ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇదిలా ఉండగా బీ టౌన్ లో శ్రీలీల(Sreeleela) నటించేందుకు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్. తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయవంతమైన సినిమాలలో నటించింది. కానీ ఇటీవలి మూవీస్ అంతగా ఆకట్టుకోలేదు. శ్రీలీల సాంగ్ దేశ వ్యాప్తంగా హల్ చల్ చేసింది.
అల్లు అర్జున్ తో పోటీగా దుమ్ము రేపింది. డ్యాన్స్ తో దుమ్ము రేపింది. కుర్రకారు గుండెలను మీటేలా చేసింది. హిందీ చిత్రంలో నటించేందుకు గాను రూ. 2 కోట్లు తీసుకుంటోందని ప్రచారం జరిగింది. కానీ మరికొందరు కోటిన్నర తీసుకుందంటూ పేర్కొన్నారు. ఏది ఏమైనా తన కెరీర్ ప్రస్తుతం పీక్ లో ఉంది.
Also Read : Hero Amir Khan-Dangal :వసూళ్లలో అమీర్ ఖాన్ దంగల్ నెంబర్ 1