Samantha Ruth Prabhu : తమిళ సినీ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న దర్శకులలో అట్లీ కుమార్ వెరీ స్పెషల్. మనోడి టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది.
తాజాగా తాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన జవాన్ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి.
Samantha Ruth Prabhu Got Missed In Jawan
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ప్రతి నాయకుడిగా విజయ్ సేతుపతి , నయన తార, దీపికా పదుకొనే కీలక పాత్రలలో కనిపించనున్నారు. సినిమాకు సంబంధించి అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.
షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పేరుతో రూ. 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టి జవాన్ ను తీశాడు. ఇంకా విడుదల కాకుండానే పెట్టిన డబ్బులు తిరిగి వచ్చాయి. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా మార్కెట్ ద్వారా వచ్చినట్లు సినీ వర్గాలలో టాక్.
విచిత్రం ఏమిటంటే నయన తార కంటే ముందు దర్శకుడు అట్లీ కుమార్ లవ్లీ బ్యూటీ సమంత రుత్ ప్రభును(Samantha Ruth Prabhu) 2019లో సంప్రదించాడట. కానీ డేట్స్ కుదరక పోవడంతో ఒప్పుకోలేదట. దీంతో బిగ్ చాన్స్ పోగొట్టుకుంది.
Also Read : Jailer Record : కేరళలో జైలర్ అరుదైన రికార్డ్