Aishwarya : తమిళ సినీ రంగానికి చెందిన ఐశ్వర్య రాజేశ్ సంచలనంగా మారారు. తెలుగులో మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరొందిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. ఇందులో తను పోషించిన భార్య పాత్రకు మంచి పేరు వచ్చింది. మరో వైపు మాజీ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి అద్బుతంగా నటించింది. ఈ చిత్రానికి మరో హైలెట్ గా నిలిచాడు బుల్లి రాజు.
Aishwarya Rajesh-Suzhal Series
తాజాగా ఐశ్వర్య రాజేశ్(Aishwarya) నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. తను నటించిన సుజల్ 2 హిట్ అయిన తమిళ వెబ్ సీరీస్ సుజల్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతోంది. ఈ మేరకు వెబ్ సీరీస్ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 28న అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.
ఉత్కంఠ, థ్రిల్స్, ప్రతిభావంతులైన తారాగణంతో కూడిన ఈ సీజన్ ఉత్తేజకరమైన కథాంశాన్ని అందిస్తుంది. సంక్రాంతికి వస్తున్నం విజయంతో తాజాగా వచ్చిన ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ సుజల్ 2 కోసం సిద్ధమవుతోంది.
ఐశ్వర్య రాజేష్, కతిర్ సుజల్ 2లో తిరిగి వస్తారు. కథ మొదటి సీజన్ నుండి కొనసాగుతుంది. .ఈ షోను వాల్వాచర్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. దీనిని బ్రామ్మ, సర్జున్ కెఎం దర్శకత్వం వహిస్తున్నారు. తారాగణంలో లాల్, శరవణన్, గౌరీ కిషన్, మోనిషా బ్లెస్సీ, సాయుక్త విశ్వనాథన్ ఉన్నారు.
మంజిమా మోహన్, కాయల్ చంద్రన్ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. రాబోయే సీజన్ అభిమానులకు ఉత్తేజకరంగా, ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ట్రైలర్ త్వరలో విడుదల అవుతుంది.
Also Read : Hero Nikhil Movie :నిఖిల్ సిదార్థతో కార్తికేయ 3 కన్ ఫర్మ్