Sai Pallavi : సినీ ఇండస్ట్రీలో అత్యంత సహజ సిద్దమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది మలయాళ కుట్టి , నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. తను తాజాగా అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన తండేల్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణ సారథ్యంలో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైంది.
Sai Pallavi Comments
అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దూసుకు పోతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఇది నిజ జీవితంలో జరిగిన కథ. సాయి పల్లవి(Sai Pallavi) నటన నభూతో నభవిష్యత్. కథకు అనుగుణంగా లీనమై పోయింది. అందరూ ఆమె నటనకు ఫిదా అయ్యారు. గతంలో శేఖర్ కమ్ములతో ఫిదా మూవీలో నటించింది.
తెలుగు వారి ఇళ్లల్లో తను ఒకరిగా మారి పోయింది సాయి పల్లవి. ఈ సినిమా కంటే ముందు భారత దేశ సైనికుడి కథకు సంబంధించిన అమరన్ చిత్రంలో నటించింది. ఈ సందర్బంగా తను కూడా సైనికులతో కలిసి మాట్లాడింది. వారి అనుభవాలను విని కన్నీటి పర్యంతమైంది. కథ బాగుంటేనే ఓకే చెబుతోంది. జుగుస్సాకరంగా ఉండే ఏ పాత్రలైనా నో చెప్పేస్తోంది.
తాజాగా తండేల్ ఏకంగా రూ. 100 కోట్లను దాటేసింది. అతి తక్కువ రోజుల్లోనే నిర్మాతకు కాసుల పంట పండించేలా చేసింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసేసింది. తండేల్ సక్సెస్ కావడంతో సాయి పల్లవి చిట్ చాట్ చేసింది. జీవితంలో మరిచి పోలేని సినిమాలు ఉన్నాయని. వాటిలో ఒకటి అమరన్ రెండు తండేల్ అని చెప్పింది. అయితే తనకంటూ ఓ కల ఉందని అది జాతీయ అవార్డు పొందడం మాత్రమేనని స్పష్టం చేసింది సాయి పల్లవి.
Also Read : హ్యాట్రిక్ మూవీస్ తో రష్మిక కెవ్వు కేక