Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సంచలనంగా మారింది. ఈ లవ్లీ బ్యూటీకి గత ఏడాదితో పాటు ఈ ఏడాది విడుదలైన ఛావా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణ బీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ రష్మిక(Rashmika) కెరీర్ లో బిగ్గెస్ట్ గా నిలిచింది.
Rashmika Mandanna Hatric Success
ఇదే సమయంలో క్రియేటివిటీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో బన్నీతో నటించిన పుష్ప సీక్వెల్ మూవీ పుష్ప2 ది రూల్ భారత దేశ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఏకంగా ఈ మూవీ గత డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. తొలి షో నుంచే తన దూకుడు పెంచింది. ఏకంగా రూ. 2,000 కోట్లు వసూలు సాధించి సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
2024 లో యానిమల్, పుష్ప2 దుమ్ము రేపితే కొత్త ఏడాది 2025లో వాలంటైన్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా విక్కీ కౌశల్ తో కలిసి నటించిన ఛావా చారిత్రాత్మక చిత్రం విడుదలై కాసులు కురిపిస్తోంది. ఇది ఏకంగా ఇప్పటికే రూ. 100 కోట్లను సాధించింది. మరో రికార్డ్ ను బ్రేక్ చేసేందుకు రెడీ అవుతోంది.
ఇది మరాఠా యుద్ద భూమిలో యోధుడిగా గుర్తింపు పొందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇందులో రష్మిక మందన్నా శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో నటించింది. ప్రేక్షకులను మెప్పించింది. దీంతో యానిమల్, పుష్ప2తో పాటు చావా సక్సెస్ కావడంతో నేషనల్ క్రష్ తన కెరీర్ లో హ్యాట్రిక్ కొట్టింది.
ఈ మూడు సినిమాలు కెవ్వు కేక అనిపించేలా ఉండడంతో రష్మిక మందన్నా డేట్స్ కోసం నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతున్నారు. కానీ తను ఇంకా ఎవరికీ ఓకే చెప్పలేదు.
Also Read : Beauty Vaishnavi Chaitanya :నిర్మాత కామెంట్స్ బేబీ సీరియస్