Rana Daggubati : టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన అమర్ చిత్ర కథ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమర్ చిత్ర కథతో తనకు వ్యక్తిగతంగా అనుబంధం ఉందన్నారు. చిన్నప్పటి నుంచి ఆ కథలంటే ఇష్టం. అందుకే చదవడం ప్రారంభించానని చెప్పాడు.
Rana Daggubati Words about Stories
రోజు రోజుకు ఈ కథలు అంటే చాలా ఇష్టం పెరిగిందని తెలిపాడు రానా దగ్గుపాటి(Rana Daggubati). చదడం మొదలు పెట్టాక అమర్ చిత్ర కథలోని కథలతో తాను జీవించానని పేర్కొన్నాడు. కామిక్ బుక్ పబ్లిషర్ తో తన అనుబంధాన్ని మరింతగా పెంచుకునే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశాడు రానా.
ప్రస్తుతం ఈ నటుడు రాక్షస రాజు హిరణ్య కశ్యప్ పై తదుపరి చిత్రం చేస్తున్నాడు. అమర్ చిత్ర కథ కామిక్ నుండి ప్రేరణ పొందిన పాన్ ఇండియా చలన చిత్రం. వీఎఫ్ఎక్స్ నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా మద్దతు ఇస్తోందని తెలిపారు దగ్గుపాటి రానా.
ఏసీకేతో నటుడు , నిర్మాత అయిన రానా 2019 నుంచి అనుబంధం కలిగి ఉన్నాడు. ఏసీకే అలైవ్ అనే లెర్నింగ్ సెంటర్ ను ప్రారంభించాడు. దివంగత అనంత్ పాయ్ , ఆయన భార్య లలిత పాయ్ కామిక్ బుక్ పబ్లిషింగ్ కంపెనీని స్థాపించారు. స్పిరిట్ మీడియా ఇందులో వాటాను కలిగి ఉంది.
Also Read : Gadar-2 Movie Record : రూ. 500 కోట్ల క్లబ్ లోకి గదర్-2