Ranveer Singh : బాలీవుడ్ నటుడు రణ్ బీర్ సింగ్(Ranveer Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే ముద్దుల కూతురు , బాలీవుడ్ నటి దీపికా పదుకొనే గురించి తన మనసులోని మాట బయట పెట్టారు. ఇదే సమయంలో తను నటించిన గల్లీ బాయ్ మూవీని గుర్తు చేసుకున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 14, 2019న విడుదలై దుమ్ము రేపింది. ప్రపంచ వ్యాప్తంగా జనాదరణ పొందింది.
Ranveer Singh Express…
ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ముంబై వాసులు అక్కున చేర్చుకున్నారని ప్రశంసించాడు. హిప్ హాప్ పట్ల తనకు ఉన్న ప్రేమ కూడా దోహద పడిందని పేర్కొన్నాడు. రాపింగ్ మూవీలో కూడా తన ప్రతిభను గొప్పగా ప్రదర్శించాడు. ఇది తెరపై ఉన్న మురాద్ పాత్రకు సరి పోయాడు. చాలా మంది గల్లీ బాయ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ చిత్రం తన జీవితంలో మరిచి పోలేని జ్ఞాపకాన్ని, అద్భుతమైన విజయాన్ని అందించిందన్నాడు.
తనకు అరుదైన పాత్రను ఇచ్చేలా అవకాశం ఇచ్చినందుకు జోయా అక్తర్ కు ధన్యవాదాలు తెలిపాడు రణ్ బీర్ సింగ్. తను చివరిసారిగా కమర్షియల్ బ్లాక్‌బస్టర్ రాకీ రాణి కీ ప్రేమ్ కహానీ (2023)లో, ఆలియా భట్‌తో కలిసి, సింగం ఎగైన్ (2024)లో అతిధి పాత్రలో కనిపించారు. తదుపరి ఆదిత్య ధార్ దురంధర్ చిత్రంలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా దీపికా పదుకొనే తన జీవితంలోకి రావడం మరిచి పోలేనన్నాడు.
Also Read : Beauty Aparna Balamurali :ఫోర్బ్స్ ఇండియా జాబితాలో అపర్ణ బాలమురళి