Sadio Maane : సాడియో మనే గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ప్రపంచంలోనే ఎన్నదగిన ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు. ఆఫ్రికాలోనే కాదు చాలా సార్లు తను అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. మైదానంలోకి వచ్చాడంటే గోల్స్ చేయాల్సిందే. తన కళ్లు, కాళ్లు రాకెట్ స్పీడ్ కంటే వేగంగా కదులుతాయి. ప్రత్యర్థులకు చిక్కకుండా బంతిని తీసుకు వెళ్లడం తన ప్రత్యేకత. తన వయసు 27 ఏళ్లు. వారానికి 1 కోటి 40 లక్షలు, సంవత్సరానికి 27 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అంతేనా ప్రస్తుతం ఫుట్ బాల్ మార్కెట్ తన వాల్యూ మిలియన్లను దాటేసింది.
Sadio Maane Simplicity Viral
చాలా సార్లు, చాలా చోట్ల విరిగిన ఫోన్‌తో కనిపించాడు. కోటీశ్వరుడై ఉండి విరిగిన ఫోన్ వాడుతున్నాడని చాలా మంది అతన్ని ఎగతాళి చేశారు. దీనిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిపేర్ చేయించుకుంటా..కొత్తది కొనలేరా అన్న ప్రశ్నకు ..నేను అలాంటివి వెయ్యి, 10 ఫెరారీ, 2 జెట్ విమానాలను, డైమండ్ గడియారాలు కొనగలను. అయితే ఇవన్నీ నాకు ఎందుకంటూ ప్రశ్నించాడు.
నేను పేదరికాన్ని చూశాను, నేను చదవలేక పోయాను, ఆ కారణంగా, ప్రజలు చదువుకునేలా నేను పాఠశాలలు నిర్మించాను. ఫుట్‌బాల్ నేర్చుకునేలా స్టేడియాలు నిర్మించాను. నాకు బూట్లు ఉండేవి కావు, అవి లేకుండానే ఆడే వాడిని, మంచి బట్టలు లేవు, తినడానికి తిండి ఉండేది కాదు ఈ రోజు నేను చాలా సంపాదించాను, కాబట్టి నేను దానిని నా ప్రజలతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సాడియో మానే (Sadio Maane)సెనెగల్ (పశ్చిమ ఆఫ్రికా) కు చెందిన వాడు. ఆ దేశ ప్రజలు తనను ఓ దేవుడిలా చూస్తున్నారు. జీవితం అంటే సంపాదించడం కాదు..ఉన్నదాంట్లో పంచుకోవడం. ఇలాంటి ఆటగాళ్లను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కదూ. హ్యాట్సాఫ్ మానే.
Also Read : Stunning Yami Gautham :యామి గౌతమి ధూమ్ ధామ్ హల్ చల్