Kingdom : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కింగ్ డమ్(Kingdom) మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. దర్శకుడు గౌతమ్ తిన్నసూరి మనసు పెట్టి చేశాడు. అద్బుతంగా సన్నివేశాలను తెరకెక్కించాడు. ఇప్పటి దాకా ఏ డైరెక్టర్ తీయని విధంగా విజయ్ ను వాడుకునే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రం పాన్ ఇండియాగా రాబోతోంది. పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. వీడీ12 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ చేశారు.
Hero Vijay Kingdom Movie Updates
జూనియర్ ఎన్టీఆర్ కింగ్ డమ్ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. హిందీ వెర్షన్ మూవీకి రణ్ బీర్ కపూర్ చేశాడు. ఇక తమిళ వర్షన్ కు సూర్య తమ గొంతు ఇచ్చారు. సినిమా పరంగా భావోద్వేగాలను పండించాడు డైరెక్టర్. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు దర్శకుడు. ఇది పూర్తిగా యాక్షన్ డ్రామాగా తీశాడు.
విజయ్ దేవరకొండకు యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో పూరీ జగన్నాథ్ తనతో లైగర్ తీశాడు. కానీ ఆశించిన మేర ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత తన నుంచి వస్తున్న చిత్రం ఇది కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాను మరోస్థాయికి తీసుకు వెళ్లేలా చేశారనడంలో సందేహం లేదు.
ఇదిలా ఉండగా గతంలో గౌతమ్ తిన్నసూరి జెర్సీ తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాదు ప్రేక్షకులను ఆలోచించేలా చేసింది. రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అద్భుతంగా కింగ్ డమ్ కు అందించాడు. సినిమాటోగ్రఫీ జోమోన్ టి జాన్ , గిరీష్ గంగాదరన్ తమ కెరా పనితనం చూపించారు. కళా దర్శకుడు అవినాష్ కోలా అద్భుతమైన పనితనం కనిపించింది.
Also Read : Kareena-Saif Love Story :కరీనా కపూర్ సైఫ్ విడి పోనున్నారా..?