Beauty Shraddha Kapoor :స్పెష‌ల్ సాంగ్ కు శ్ర‌ద్దా క‌పూర్ ఓకే 

 తార‌క్..హృతిక్ వార్ 2 మూవీలో 

Hello Telugu - Beauty Shraddha Kapoor

Shraddha Kapoor : బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్దా క‌పూర్ వైర‌ల్ గా మారారు. త‌ను న‌టించిన  స్త్రీ 2 చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలించింది. దీంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆమె కాల్ షీట్ల కోసం క్యూ క‌ట్టారు. అయినా డోంట్ కేర్ అంటోంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా మ‌రో అప్ డేట్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం వార్ 2 మూవీ కోసం త‌ను ఓ స్పెష‌ల్ సాంగ్ లో న‌టించేందుకు ఓకే చెప్పిన‌ట్లు బాలీవుడ్ లో టాక్.

Shraddha Kapoor Special Song

ఈ చిత్రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్ న‌టిస్తున్నారు కీల‌క పాత్ర‌ల్లో. గ‌తంలో శ్ర‌ద్దా క‌పూర్(Shraddha Kapoor) ను పుష్ప 2 మూవీ కోసం ప్ర‌త్యేక పాట‌లో న‌టించాల‌ని మూవీ మేక‌ర్స్ సంప్ర‌దించారు. బ‌న్నీతో న‌టించేందుకు త‌ను నో చెప్పింది. కానీ ఉన్న‌ట్టుండి తార‌క్ న‌టిస్తున్న చిత్రానికి యెస్ చెప్ప‌డం అభిమానుల‌ను విస్తు పోయేలా చేసింది.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిను పుష్ప 2 ఇండియాను షేక్ చేసింది. ఏకంగా రూ. 1800 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. రికార్డ్ సృష్టించింది. ఇందులో స్పెష‌ల్ సాంగ్ లో త‌ళుక్కున మెరిసింది ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల‌. త‌న‌కంటే ముందు ఈ సాంగ్ లో శ్ర‌ద్దా క‌పూర్ న‌టించాల్సి ఉంది. కానీ ఈ బంప‌ర్ ఆఫ‌ర్ ను వ‌దులు కోవ‌డంతో ఆ ఛాన్స్ క‌న్న‌డ బ్యూటీకి ద‌క్కింది.

వార్ 2 మూవీలో మ‌రో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా న‌టించ‌నుంది. స్పెష‌ల్ సాంగ్ లో తార‌క్, రోష‌న్ తో క‌లిసి న‌టించ‌నుంది శ్ర‌ద్దా క‌పూర్.

Also Read : చిత్రం కాదు భావోద్వేగాల స‌మ్మేళ‌నం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com