Pushpa 2 : ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, లవ్లీ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటించిన పుష్ప2 పాన్ ఇండియా మూవీ దుమ్ము రేపింది. గత డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఏకంగా రూ. 2 వేల కోట్ల క్రాస్ దాటేసింది. ఈ సందర్బంగా జరిగిన ఈవెంట్ లో పాల్గొని ప్రసంగించారు చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ . ఇది ఊహించని సక్సెస్ అని పేర్కొన్నారు.
Pushpa 2 Trending Collections
షూటింగ్ కంటే ముందు తాము చిత్రం విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నామని కానీ ఈ స్థాయిలో అభిమానులు ఆదరిస్తారని అనుకోలేదన్నారు. ఇది తమ సినీ కెరీర్ లో మరిచి పోలేని చిత్రంగా ఉండి పోతుందన్నారు మూవీ మేకర్స్.
గతంలో చాలా సినిమాలకు పని చేశామని, కానీ పుష్ప , పుష్ప2(Pushpa 2) చిత్రాలు మాత్రం భారీ ఆదాయాన్ని సమకూర్చి పెట్టాయని వెల్లడించారు. తమ కలలో కూడా అనుకోలేదన్నారు చిత్రం ఇంతలా సక్సెస్ అవుతుందని.
ఇదిలా ఉండగా డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి ప్రాణం పోస్తే..సంగీతం సినిమాలకు హైలెట్ గా నిలిచింది. ఇండియన్ రాక్ స్టార్, మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందిన దేవిశ్రీ ప్రసాద్ అద్భుతంగా అందించాడు. తను చేసిన మ్యాజిక్ ఓ రేంజ్ లో సినిమాను నిలబెట్టేలా చేసింది. పుష్ప2 కొట్టిన దెబ్బకు ఇతర సినిమాలు ఠారెత్తి పోయాయి. మొత్తంగా బన్నీనా మజాకా అంటున్నారు ఫ్యాన్. ఇక అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
పుష్ప2 ను బిగ్ సక్సెస్ చేసినందుకు అభిమానులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నానని ప్రకటించాడు.
Also Read : Jayapradha Sensational :త్రివేణి సంగమం జయప్రద పవిత్ర స్నానం