Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరూ కలిస్తే కాసుల పండుగే. ఇప్పటికే తీసిన సినిమాలు ప్రూవ్ కూడా చేశాయి. పూర్తి ఎనర్టిక్ తో నటించే సత్తా ఉన్నోడు అల్లు అర్జున్. తనకు డైరెక్టర్స్ హీరో. ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేస్తాడు. తాజాగా డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 మూవీ రికార్డు స్థాయిలో కాసులు కొల్లగొట్టింది. ఈ చిత్రం 2 వేల కోట్లకు పైగా వసూలు సాధించి సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
Trivikram New Movie with Bunny
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీతో తీసిన జులాయి, అల వైకుంఠ పురంలో చిత్రాలు బాక్సులు బద్దలు కొట్టాయి. కోట్లు కురిపించేలా చేశాయి. ప్రత్యేకించి ఈ రెండు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికే బన్నీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ వినిపించాడని, ఇది పూర్తిగా మైథలాజికల్ నేపథ్యంగా ఉండబోతోందని టాక్.
రాబోయే సినిమాకు సంబంధించి త్వరలోనే పూజలు కూడా ప్రారంభించనున్నట్లు టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో రాబోయే బన్నీ మూవీపై ఏకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు, దీనిని పాన్ ఇండియా లెవల్లో తీసేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ అయినట్లు చర్చ. సినిమాను హారిక క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా కొత్త సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.
Also Read : Megastar Happiness :మోదీతో సమావేశం మెగాస్టార్ సంతోషం