Vidaamuyarchi : సృజనాత్మకతకు పెట్టింది పేరు తమిళ సినీ ఇండస్ట్రీ. నిరంతరం కొత్త దనం ఉట్టి పడేలా దర్శకులు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్లే కాదు నటీ నటులు కూడా. అందులో ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెప్పాలి. ఏజ్ పెరిగే కొద్దీ తనను తాను ప్రూవ్ చేసుకుంటూ రూ. 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు.
Vidaamuyarchi Movie Updates
ఇక దళపతి విజయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన ఫీజు కూడా భారీగా పెంచాడు. తను ఆఖరి చిత్రం దళపతి 69 మూవీకి ఏకంగా వందల కోట్లు తీసుకున్నట్లు టాక్. ఇదే సమయంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు నటుడు అజిత్. తను చాలా కామ్. వెరీ స్పెషల్.
తనకు భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. కోలీవుడ్ లో క్రేజ్ కలిగిన నటుడిగా గుర్తింపు పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను తాజాగా అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్ తో కలిసి విడాముయార్చి(Vidaamuyarchi) లో నటించాడు. ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. భారీ కలెక్షన్ల దిశగా దూసుకు పోతోంది. ఈ సందర్బంగా సక్సెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమాను మనసు పెట్టి తీశాడంటూ డైరెక్టర్ మాగిజ్ తిరుమేనిని ప్రశంసించాడు. అంతే కాదు కన్నడ హీరో అర్జున్ విలన్ గా న్యాయం చేశాడని, నటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నాడు.
Also Read : Razakar Movie Success :ఆహాలో తెలంగాణ ‘రజాకార్’ సూపర్