Srinidhi Shetty : యూపీ వేదికగా జరుగుతున్న మహా కుంభ మేళా భక్తులతో పోటెత్తుతోంది. ఇప్పటి దాకా కోట్లాది మంది పవిత్ర స్నానం చేశారు. సినీ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, కార్పొరేట్ టైకూన్లు సైతం క్యూ కడుతున్నారు. చక్ దే ఫేమ్ కబీర్ ఖాన్ తో పాటు మమతా కులకర్ణి, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఇప్పటికే గంగలో మునిగారు.
Srinidhi Shetty Viral At..
తాజాగా పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ లో నటించిన శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) సంచలనంగా మారారు. తను కూడా మహా కుంభ్ మేళాను సందర్శించారు. తన కుటుంబంతో కలిసి వచ్చిన శెట్టి పవిత్ర స్నానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నటి శ్రీనిధి శెట్టి. తన జీవితం ధన్యమైందన్నారు. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక పండుగలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తండ్రితో కలిసి స్నానం చేయడం గొప్ అనుభూతి మిగిల్చిందన్నారు. తన చిన్ననాటి బాల్యం గుర్తుకు వచ్చిందన్నారు . ఇలాంటి రోజులు మళ్లీ రావన్నారు.
నేను పడుకున్నా లేస్తున్నా ప్రతి రోజూ ప్రయాగ్ రాజ్ గుర్తుకు వచ్చిందన్నారు శ్రీనిధి శెట్టి. తన జీవితంలో ఇది మరిచి పోలేని జ్ఞాపకంగా మిగిలి పోతుందన్నారు. ఇటు సినీ రంగం కూడా తనకు మంచి కిక్ ఇస్తుందన్నారు.
Also Read : Sonu Sood Shocking :సోనూ సూద్ కు అరెస్ట్ వారెంట్