Hero Nagarjuna Assets: ఆస్తుల్లో అంద‌నంత ఎత్తులో నాగార్జున‌

నిక‌ర ఆస్తుల విలువ రూ. 3,571 కోట్లు

Nagarjuna : అటు సినిమాల‌తో ఇటు బుల్లితెర‌పై దుమ్ము రేపుతున్నాడు అక్కినేని నాగార్జున‌(Nagarjuna). గ‌తంలో చిరంజీవి కూడా బిగ్ బిని అనుక‌రిస్తూ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్ నిర్వ‌హించాడు. ఈ ఇద్ద‌రు ఇప్పుడు దేశంలోనే సంచ‌ల‌నంగా మారారు. కార‌ణం తాజాగా దేశ వ్యాప్తంగా న‌టీ న‌టుల్లో ఎవ‌రికి ఎన్ని ఆస్తుల‌న్నాయ‌నే దానిపై స‌ర్వే చేప‌ట్టారు. దిమ్మ తిరిగేలా కోట్లాది రూపాయ‌లు కూడబెట్టారు. వారి నిక‌ర ఆస్తుల విలువ వేల కోట్లు కావ‌డం విశేషం.

Nagarjuna Assets..

గ‌తంలో బాలీవుడ్ కు చెందిన న‌టీ న‌టులు అన్నింట్లో టాప్ లో ఉండే వారు. కానీ సీన్ మారింది. ఇప్పుడు తెలుగు సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. దీనికి కార‌ణం దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి. త‌ను తీసిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు ద‌క్కించుకుంది. ఇక సుకుమార్ తీసిన పుష్ప దుమ్ము రేపింది. దీంతో తెలుగు వాడి స‌త్తా లోకాన్ని విస్తు పోయేలా చేసింది.

ఇది ప‌క్క‌న పెడితే ఏయే న‌టుల‌కు ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయ‌నే దానిపై స‌ర్వే చేప‌ట్టింది మ‌నీ కంట్రోల్ సంస్థ‌. ద‌క్షిణాదిన టాప్ లో నిలిచాడు అక్కినేని నాగార్జున‌. త‌న నిక‌ర ఆస్తుల విలువ రూ. 3,572 కోట్లకు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. ఇక షారుఖ్ ఖాన్ ఆస్తులు రూ. 7,300 కోట్లు, జూహ్లీ చావ్లా ఆస్తులు రూ. 4,600 కోట్లు, అమితాబ్ బ‌చ్చ‌న్ ఆస్తుల విలువ రూ. 3,200 కోట్లు, హృతిక్ రోష‌న్ ఆస్తుల వాల్యూ రూ. 3,100 కోట్లు.

ఇక కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ రూ. 2,900 కోట్లు, అక్షయ్ కుమార్ ఆస్తుల విలువ రూ. 2,700 కోట్లు, అమీర్ ఖాన్ ఆస్తుల విలువ రూ. 1900 కోట్లు గా ఉండ‌డం విశేషం. ద‌క్షిణాది విష‌యానికి వ‌స్తే నాగ్ టాప్ లో ఉండ‌గా చిరంజీవి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. త‌న నిక‌ర ఆస్తుల విలువ రూ. 1650 కోట్లు, రామ్ చ‌ర‌ణ్ ఆస్తుల విలువ రూ. 1370 కోట్లు, క‌మ‌ల్ హాస‌న్ ఆస్తుల వాల్యూ రూ. 600 కోట్లు, ర‌జ‌నీకాంత్ ఆస్తుల విలువ రూ. 500 కోట్లు, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆస్తుల వాల్యూ రూ. 500 కోట్లు, ప్ర‌భాస్ ఆస్తుల విలువ రూ. 250 కోట్లుగా ఉందంటూ తేల్చింది.

Also Read : King Nagarjuna Assets: ఆస్తుల్లో అంద‌నంత ఎత్తులో నాగార్జున‌

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com