Priyanka Jain : ఆధ్యాత్మిక సంబురం మహా కుంభ మేళా కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని నాలుగు చోట్ల ఘాట్స్ ను ఏర్పాటు చేసింది యోగి ప్రభుత్వం. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. రెండు మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. అగ్ని ప్రమాదాలతో పాటు ఏర్పాటు చేసిన బారికేడ్లు కూలిన ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు భక్తులు. అయినా ఎక్కడా ఆగడం లేదు భక్తుల సంఖ్య.
Priyanka Jain Viral At..
మహా కుంభ మేళాకు భక్తులతో పాటు సెలిబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులంతా క్యూ కడుతున్నారు. పీఎం మోడీ, సీఎంలు, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నేతలు, దిగ్గజ సంస్థలు, కంపెనీలకు చెందిన సీఈఓలు, ఎండీలు, వ్యాపారవేత్తలు పుణ్య స్నానాలు చేస్తున్నారు.
తాజాగా సినీ నటులు కూడా తళుక్కుమంటున్నారు. నిన్న కేరళ కుట్టి సంయుక్త మీనన్ పుణ్య స్నానం చేస్తే..ఇవాళ తెలుగు బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. కుంభ మేళాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. విచిత్రం ఏమిటంటే తన ప్రియుడితో కలిసి పుణ్య స్నానం చేయడం ఆసక్తిని రేపింది.
Also Read : Beauty Rashmika Tweet : కనిపించని దయా గుణం ఆందోళనకరం