Anasuya : నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కామంపై ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. ఇటీవల చిట్ చాట్ సందర్బంగా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేసింది. స్త్రీ, పురుషుల మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా పేర్కొంది. ప్రత్యేకించి యూత్ కు కొంచెం ఆ విషయంలో తెలుసు కోవాలన్న కోరిక ఉంటుందని, దానిని తప్పు పడితే ఎలా అని ప్రశ్నించింది.
Anasuya Shosking Comments on…
మానవ జీవితంలో కామం అనేది తప్పు కాదని, అది అత్యంత సహజమైనదిగా అనసూయ భరద్వాజ్(Anasuya) స్పష్టం చేసింది. ఇందులో తప్పేముందంటూ నిలదీసింది. ఆహారం, దుస్తులు ఎలాగో మనుషులకు కోరికలు అత్యంత సహజమైనవని చెప్పింది.
ఏదైనా మితంగా ఉండాలని సూచించింది. కానీ కొందరు బహిరంగంగా రెచ్చి పోతే అది పూర్తిగా తప్పేనని అన్నది. కొన్నిసార్లు సిగ్గు అనేది లేకుండా చర్చించడంలో తప్పు లేదన్నది. ఇదిలా ఉండగా అనసూయ భరద్వాజ్ చేసిన కామెంట్స్ ను కొందరు నెటిజన్లు సమర్థిస్తుండగా మరికొందరు విభేదించారు. ఏది ఏమైనా అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టడం బాగుందంటున్నారు ఫ్యాన్స్.
Also Read : Hero Charan-Game Changer :అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్