Mangli : మళ్లీ జన్మంటూ ఉంటే సింగర్ గానే పుట్టాలని కోరుకుంటానని అన్నారు ప్రముఖ గాయని మంగ్లీ(Mangli). తొలిసారి శ్రీకాకుళంలో పేరు పొందిన సూర్య దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ ప్రాంతపు ప్రజల అభిమానం, ప్రేమను తాను ఎప్పటికీ మరిచి పోలేనని అన్నారు. ఈ సందర్బంగా స్వామి వారిపై అన్నమయ్య కీర్తనను హృద్యంగా ఆలాపించారు మంగ్లీ.
Mangli Interesting Comments
స్వామి వారి దర్శనం చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని అన్నారు. యాంకర్ గా, జానపద పాటలతో ఎంట్రీ ఇవ్వడం యాధృశ్చికంగా జరగలేదన్నారు. సినిమాలలో కూడా అవకాశాలు వస్తాయని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. కానీ ఆ దేవుడు తనపై కరుణ చూపాడాని, ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పింది మంగ్లీ.
తాను పాడిన పాటలన్నీ జనాదరణకు నోచుకున్నాయని, తనను తెలంగాణ బతుకమ్మగా భావించడం ఆనందంగా ఉందన్నారు. తాను పాడిన అత్యధిక ఫోక్ సాంగ్స్ లలో ఎక్కువగా సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయన్నారు. ఇదే సమయంలో అల వైకుంఠపురంలో పాడిన రాములో రాములా సూపర్ హిట్ గా నిలిచిందని, ఇది తనకు ఎంతో పేరు తీసుకు వచ్చేలా చేసిందన్నారు.
ఇక తన సోదరికి ఛాన్స్ ఇచ్చినందుకు దేవిశ్రీ ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. సినిమా రంగానికి చెందిన వారు తనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నందుకు వారికి కృతజ్క్షతలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు మంగ్లీ.
Also Read : Hero Manchu Manoj : మోహన్ బాబు..మనోజ్ వాగ్వావాదం