Pawan Kalyan : జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్వయంగా పాడిన పాటను రిలీజ్ చేశారు. భారీ ఆదరణ లభించింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
Pawan Kalyan ‘Hari Hara Veera Mallu’ Movie Poster..
పవర్ స్టార్ తో పాటు అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ హరి హర వీర మల్లులో తెర పంచుకుంటోంది. తాజాగా పవర్ స్టార్ కు సంబంధించిన అరుదైన ఫోటోను షేర్ చేశారు. విల్లంబును ఎక్కు పెడుతూ ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో బిజీగా ఉండడం, రాజకీయాలలో కీలక పాత్ర పోషించడంతో డేట్స్ కుదరలేదు. షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ మధ్యన ఎలాగైనా సరే మూవీని కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు పవర్ స్టార్. ఆస్కార్ అవార్డు పొందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చారిత్రక నేపథ్యం కథాంశంతో వస్తున్న హరి హర వీరమల్లుకు సంగీతం అందిస్తున్నారు.
Also Read : Beauty Sai Pallavi : ఆశలన్నీ తండేల్ మూవీ పైనే