Pushpa 2 : ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, లవ్లీ బ్యూటీ శ్రీలీల కలిసి నటించిన పుష్ప-2 మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు మూవీ మేకర్స్. తొలి షో నుంచే నేటి దాకా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాక్సులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది.
Pushpa 2 OTT Updates
ఊహించని రీతిలో ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ. 2,200 కోట్లకు పైగా వసూలు చేసింది. పుష్ప మూవీకి సీక్వెల్ గా తెరకెక్కించాడు అద్భుతంగా దర్శకుడు సుకుమార్. మరో వైపు భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. పుస్ప-2(Pushpa 2) చిత్రానికి సంబంధించిన రైట్స్ ను స్వంతం చేసుకుంది. ఇతర ఓటీటీ సంస్థలు పోటీ పడినా ఎక్కువ చెల్లించినట్టు సమాచారం.
ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. జనవరి నెలాఖరు లోగా పుష్ప-2 చిత్రం స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతోంది. బన్నీ మూవీ కోసం ఓటీటీ ప్రేక్షకులు తెగ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం , పాటలు బిగ్ అస్సెట్ గా మారాయి. శుక్రవారం నాటికి 51 రోజులు పూర్తి చేసుకుంది పుష్ప-2 మూవీ. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, రవిలు నిర్మించారు. ఐటీ కూడా దాడులు చేపట్టింది.
Also Read : Hero Vijay Meet : రథసారథితో దళపతి ములాఖత్