Dil Raju : హైదరాబాద్ – ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కు కోలుకోలేని షాక్ తగిలింది. ఏక కాలంలో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) ఆధ్వర్యంలో నివాసాలు, ఆఫీసులలో దాడులు చేపట్టారు. మొత్తం ఎనిమిది చోట్ల 55 మంది అధికారులతో సోదాలు చేపట్టారు. ఇందుకు సంబంధించి స్పందించారు దిల్ రాజు(Dil Raju) సతీమణి తేజస్విని.
Dil Raju Wife Shocking Comments..
ఐటీ బృందాలు కోరిన మేరకు బ్యాంకర్లకు చెందిన లాకర్లను తెరిచి చూపించామని చెప్పారు. తాము ఎక్కడా ఐటీ ఆదాయానికి గండి కొట్ట లేదంటూ ప్రకటించారు. ప్రతి పైసాకు లెక్కలు ఉన్నాయని తెలిపారు.
ఇదిలా ఉండగా హైద్రాబాద్ లోని జూబ్లీ హిల్స్ , కొండాపూర్ , గచ్చి బౌలి, బంజారా హిల్స్ తో పాటు పలు చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు తో పాటు ప్రముఖ గాయని సునీత భర్తకు చెందిన కంపెనీలో కూడా ఐటీ శాఖ దాడులు చేపట్టింది.
ప్రస్తుతం దిల్ రాజు (వెంకట రమణా రెడ్డి ) నిర్మాతగా , తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ , కూతురు హన్సిత రెడ్డి ఇళ్లలోనూ ఐటీ బృందాలు జల్లెడ పడుతున్నాయి. మరో వైపు పుష్ప-2 మూవీ చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాల్లో దాడుల పరంపర కొనసాగుతుండడం విశేషం.
Also Read : Victory Venkatesh SV Movie : ఓవర్సీస్ లోనూ కలెక్షన్స్ అదుర్స్