Kiran Abbavaram : ఎవరి సహకారం లేకుండానే తనంతకు తానుగా నటుడిగా ప్రూవ్ చేసుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకడు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని తను నమ్మాడు. అందుకే చేసిన సినిమాలు కొన్నే అయినా వాటిని ఇంటిల్లిపాది చూసేలా జాగ్రత్త పడుతున్నాడు. తాజాగా విశ్వకరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), రుక్సర్ థిల్లాన్ కలిసి దిల్ రుబాలో నటిస్తున్నారు.
Kiran Abbavaram Dil Ruba Movie Updates
ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. మూవీ మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. దిల్ రుబాను పూర్తిగా యాక్షన్ ఓరియంటెడ్ గా తీర్చిదిద్దుతున్నారు. శివమ్ సెల్యూలాయిడ్స్ , సారెగమ మ్యూజిక్ సంయుక్తంగా దిల్ రుబాను నిర్మిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పోస్టర్స్ ను, గ్లింప్స్ ను మరింత ఆకట్టుకునేలా తీర్చి దిద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అగ్గి పుల్లె పేరుతో తొలి సాంగ్ ను విడుదల చేశారు. హాయిగా, వినసొంపుగా ఉంది ఈ పాట. చిత్రీకరణ కూడా మెస్మరైజ్ చేసేలా ఉంది. కీలక అప్ డేట్ ఇచ్చారు దర్శక, నిర్మాతలు. వచ్చే ఫిబ్రవరి నెల 14న వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) సందర్బంగా దిల్ రుబాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : Hot Beauty – Taapsee : గాంధారి షూటింగ్ లో తాప్సీ పన్ను బిజీ