Balakrishna : హైదరాబాద్ – బాబీ దర్శకత్వంలో తాను నటించిన డాకు మహారాజ్ అద్బుత విజయాన్ని అందుకోవడం పట్ల ఆనందంగా ఉందన్నారు నటుడు బాలకృష్ణ(Balakrishna). తన జీవితంలో మరిచి పోలేని సినిమాగా గుర్తుండి పోతుందన్నారు. తన నుంచి ఏం కావాలనే దానిపై పూర్తిగా క్లారిటీ ఉన్న దర్శకులలో బాబీ ఒకడని కితాబు ఇచ్చారు.
Hero Balakrishna Comment
ఈ సినిమా సక్సెస్ తన వల్ల కాదని ఇది అందరి వల్లనే సాధ్యమైందన్నారు. గత కొంత కాలం నుంచి ప్రేక్షకులు తనను భిన్నమైన రోల్స్ లో చూడాలని అనుకుంటున్నారని, ఆ విధంగా సెంటిమెంట్ , రౌద్రం, రొమాన్స్ ..ఇలా అన్నింటిని మేళవించి సినిమాలో ఉండేలా చూసుకుంటున్నానని చెప్పారు.
డాకు మహారాజ్ సక్సెస్ మీట్ సందర్బంగా బాలయ్య మాట్లాడారు. తన కెరీర్ లో ఎన్నో మరిచి పోలేని సినిమాలు ఉన్నాయని, కానీ ఇటీవల తను నటించిన చిత్రాలు మాత్రం వేటికవే సాటి రావంటూ పేర్కొన్నారు.
ప్రధానంగా ఊర్వశి రౌటేలా, శ్రద్దా త్రినాథ్, ప్రగ్యా జైశ్వాల్ తో పాటు ఇతరులు కూడా తమకు ఇచ్చిన పాత్రలలో లీనమై నటించారని, ప్రత్యేకించి తాను చెప్పాల్సింది మాత్రం సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ కు అని అన్నారు. తను ప్రాణం పెట్టి మరోసారి తన సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి మ్యాజిక్ చేశాడంటూ ప్రశంసల జల్లులు కురిపించారు నందమూరి బాలకృష్ణ.
Also Read : Hero Saif – Kareena Comment : ప్రతిఘటించినందుకే సైఫ్ పై కత్తిపోట్లు